ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేసిన టిడిపి నాయకులు

★యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం నిర్వహించిన టిడిపి నాయకులు.

సాక్షి డిజిటల్ న్యూస్: నవంబర్ 2 ( ప్రకాశం జిల్లా బ్యూరో ఇన్చార్జి: షేక్ మక్బూల్ బాషా). యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు యర్రగొండపాలెం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్ఠీఆర్ భరోసా పింఛన్ పంపిణి కార్యక్రమాన్ని పట్టణంలోని 26 వ బూత్ ఇంచార్జ్ లు సయ్యద్ అల్లామాలిక్, బొందిలి కిషోర్ సింగ్ పరిధిలోని పెద్ద మసీద్ బజారు, అసిఫ్ నగర్ లలో అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణి చేశారు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో పెంచిన ఎన్ఠీఆర్ భరోసా పింఛన్లను సచివాలయ ఉద్యోగుల ద్వారా ఉదయం 7 గంటల నుండే పంపిణి చేశామన్నారు. వృద్దాప్య, వితంతు పింఛన్ దారులకు 4 వేలు, వికలాంగులకు 6 వేలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎమ్.సి చైర్మన్ చేకూరి సుబ్బారావు, మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగళరెడ్డి,పంచాయతీ కార్యదర్శి రామసుబ్బయ్య, క్లస్టర్ ఇంచార్జ్ షేక్ మస్తాన్ వలి (మ్యాక్స్),కంచర్ల సత్యనారాయణ గౌడ్, మంత్రు నాయక్,పట్టణ అధ్యక్షులు పెరుమాళ్ళ మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి కంచర్ల పూల సుబ్బయ్య,యూనిట్ అధ్యక్షులు తోట మహేష్ నాయుడు,కొత్తమాసు సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు గోళ్ళ సుబ్బారావు,మండల టీడీపీ ఉపాధ్యక్షులు వెంకట నారాయణ,బూత్ ఇంచార్జ్ లు షేక్ వలి, పమిడిమర్రి కిషోర్, వెంకటేశ్వర్లు, శివకృష్ణ, షేక్ అయ్యుబ్, షేక్ నూరి, విజయ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.