సాక్షి డిజిటల్ న్యూస్ 1 నవంబర్ ఏన్కూర్ రిపోర్టర్ గుగులోత్ మజిలాల్, పదవ తరగతి విద్యార్థులకు బురద రాఘవాపురం పాఠశాలలోఉదయం అల్పాహారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో AMO పి. ప్రభాకర్ రెడ్డి గారు, CMO బి.ప్రవీణ్ కుమార్ గారు ,పంచాయతీ సెక్రెటరీ కోటేశ్వర్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు
పి.నాగిరెడ్డి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు అయ్యేంతవరకు ఉదయం అల్పాహారం ఉపాధ్యాయుల సహకారంతో ఏర్పాటు చేయడమైనదని ప్రధానోపాద్యాయులు పి. నాగిరెడ్డి తెలిపారు. ఉదయం విద్యార్థులు ఏమి తినకుండా పదవ తరగతి ప్రత్యేక తరగతులకు 8 గంటల కల్లా వస్తున్నందున, వారు ఆకలితో ఉంటున్నారని భావించి ముందుగా ఉపాధ్యాయులు అందరూ కలిసి అనుకొని ప్రారంభించడం జరిగింది. ఇది ఉదయం అల్పాహారం అనేది పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు అయ్యేంతవరకు జరుపుతామని ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉదయం తప్పక సకాలంలో పాఠశాలకు రావాలని, అల్పాహారాన్ని తీసుకొని చదువు ప్రారంభించాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉంటేనే శ్రద్ధగా చదవగలరని తెలియజేశారు. ఖమ్మం జిల్లాలోని మొట్టమొదటిసారిగా మన పాఠశాలలో ఉపాధ్యాయుల సహకారంతో అల్పాహారం ప్రారంభిస్తున్నామని అందుకు చాలా సంతోషంగా ఉందని ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు హాజరైన AMO మాట్లాడుతూ, జిల్లాలోనే మొట్ట మొదటి సారిగా ఉపాధ్యాయుల సహకారంతో ఉదయం పూట అల్పాహారం అందించడం ఇదే ప్రథమం అని పాఠశాల సిబ్బందిని ప్రశంసించారు. విద్యార్థులందరూ కూడా టైం ప్రకారం ఉదయం వచ్చి అల్పాహారం తీసుకొని ప్రత్యేక తరగతిలో మంచిగా చదువుకొని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తేవాలని ప్రయోజకులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో CMO ప్రవీణ్ ,గ్రామ పంచాయతీ సెక్రెటరీ గార్లు విద్యార్థులకు మంచి కార్యక్రమం ప్రారంభించారని, విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. దాతలు ముందుకు వచ్చి ఆర్దిక సహాకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు , మధ్యాహ్నా భోజన సిబ్బంది పాల్గొన్నారు.