ఈ నెల 15 న స్పెషల్ లోక్‌ అదాలత్‌

సాక్షి డిజిటల్ నవోంబర్ 02 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :స్పెషల్ లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు , సద్వినియోగం చేసుకోవాలని ధర్మపురి కోర్టు న్యాయమూర్తి యేగి జానకి అన్నారు శనివారం కోర్టు లో న్యాయవాదులు పోలీస్ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తి జానకి మాట్లాడుతూ రాజీమార్గమే రాజ మార్గం అని ఈ నెల 15 శనివారం రోజున స్పెషల్ లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నాం అని తెలిపారు
కక్షిదారులకు ఇదొక సువర్ణావకాశం. కోర్టుల్లో ఎప్పటి నుంచో ఉన్న కేసులను రాజీ చేసుకుని.. కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు లోక్‌ అదాలత్‌ పనిచేస్తుంది. సివిల్‌ కేసులు, వివాహ సంబంధిత కేసులు, మోటార్ ప్రమాద క్లెయిములు, చెక్ బౌన్స్ కేసులు, ఇతర రాజీపడదగిన క్రిమినల్ కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కరించు కోవాల’ని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు దుమ్మెన శ్రీనివాస్ ,రౌతు రాజేష్, జాజాల రమేష్, కలమడుగు కీర్తి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.