సాక్షి డిజిటల్ నవంబర్ 1 తంబళ్లపల్లె మండల రిపోర్టర్ ఇ. రమేష్ బాబు. తంబల్లపల్లి మండలం చేలూరివాండ్లపల్లి పంచాయతీ కురవపల్లి కి చెందిన విద్యార్థులు ఆటోలో తంబళ్లపల్లెకు సమీపంలోని మోడల్ స్కూలుకు వెళ్లడం ఆనవాయితీ. శనివారం యధావిధిగా ఆటోలో విద్యార్థులు వెళుతుండగా హై స్కూల్ దాటగానే రోడ్డుకు అడ్డంగా కుక్క రావడంతో ఆటో డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదు మంది పిల్లలకు గాయాలు కాగా తంబళ్లపల్లె ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు చేయించారు. ఎంఈఓ త్యాగరాజు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్,మరియు గోపి విద్యార్థులను ఆస్పత్రిలో పరామర్శించారు.