డిజిటల్ న్యూస్,కామేపల్లి (నవంబర్ 1): సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాలను కాపాడుకోవాలని,పరిసరాల పరిశుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కామేపల్లి ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ యన్. చందన, డాక్టర్ జి.శిరీష పేర్కొన్నారు.శనివారం వైద్యశాలలో వారు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,త్రాగు నీటిని క్లోరినేషన్ చేయాలని, డ్రైనేజీ లలో బ్లీచింగ్ పౌడర్ వేసుకోవాలని సూచించారు.అందరూ తమ పరిసరాల ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకోవాలని తెలిపారు.వ్యక్తిగత పరిశుభ్రత చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే రోగాలకు దూరంగా ఉండవచ్చని తెలిపారు. ప్రజలందరూ నీటిని వేడి చేసుకొని చల్లారిన తర్వాత తాగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్ఇఓ కె.వెంకటేశ్వర్లు,హెల్త్ సూపర్వైజర్లు రాధాకృష్ణ,బి. నరేంద్ర కుమార్,జె.శ్రీనివాసరావు, స్టాఫ్ నర్స్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.