సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వేగి రామారావు అనకాపల్లి రూరల్ (నవంబర్ 1), అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ హాస్పిటల్ పక్కన ఉన్న అన్న క్యాంటీన్‌లో పేదల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ అన్నా క్యాంటీన్‌లో భోజనం ఉదయం 12:30 నుండి 1:15 వరకు మాత్రమే భోజనం అందించి ,తర్వాత లైన్‌లో నిల్చున్న పలువురు పేదలు, వృద్ధులు, కూలీలు ఆహారం దొరకక నిరాశతో వెనుదిరిగారు. నియమ ప్రకారం భోజనం మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు అందించాలి, కానీ సమయం పూర్తికాకముందే భోజనం అయిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ ఇది ఇలా ఉండగా ఎప్పుడూ పచ్చడి ముందుగానే అయిపోతుంది, భోజనం కొలతకు తగ్గిస్తారు, చివరికి మనల్ని లైన్‌లో నిలబెట్టించి పంపేస్తారు” అని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పేదల ఆకలి తీర్చే ఈ అన్న క్యాంటీన్‌లు విధిగా పనిచేయడం లేదని, పర్యవేక్షణలో లోపాలున్నాయని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భోజన సమయాన్ని సరిగ్గా పాటించేలా చూడాలనీ, పేదల కోసం ఏర్పాటు చేసిన ఈ సేవలో భోజన పరిమాణం, నాణ్యత, సమయాన్ని పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలి పేదలు డిమాండ్ చేస్తున్నారు. “పేదల ఆకలి తీర్చడమే లక్ష్యం అయితే, ప్రతి పేదరిక రేఖలో ఉన్నవారికి భోజనం అందేలా చూడాలి” అని సామాజిక సేవకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.