సాక్షి డిజిటల్ న్యూస్:జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 01 రిపోర్టర్ షేక్ సమీర్ భద్రాది కొత్తగూడెం జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల గురించి పట్టించుకోకుండా అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయిన కూడా రైతులకు నష్ట పరిహారం ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అధిక వర్షాల వల్ల పంటలు పూర్తిగా దెబ్బ తిన్నవి మొన్న వచ్చిన మొంథా తుఫాన్ వల్ల పత్తి పూర్తిగా మొలకెత్తి 90% పత్తి రాలిపోయినది. జిల్లాలో అధిక వర్షాల వల్ల 90% రైతులు ఇంతవరకు ఒక్కసారి కూడా పత్తి తీయలేదు, అదే కాకుండా కూరగాయలు పంటలు, వరి, మిర్చి, పండ్లు తోటలు, పప్పు దినుసు పంటలు మరియు అన్ని రకాల పంటలు పూర్తిగా దెబ్బ తిన్నవి, కానీ అగ్రికల్చర్ అధికారులు ఎక్కడా సర్వే చేయకుండా తూతూ మంత్రంగా ఇంట్లో ఉండే మండలానికి 5 ఎకరాలు 10 ఎకరాలు రాసి పంపినారు, కావున నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలి, పత్తి వేసిన రైతు తీవ్రంగా నష్టపోయినారు కావున పత్తి వేసిన ప్రతి రైతు కూడా నష్టపరిహారం ఇవ్వాలి, వరి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయినారు, పంటల బీమాను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల ప్రతి రైతుకు నష్టం జరిగినది, కావున రైతులకు పూర్తి నష్టపరహారం చెల్లించాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జల్లారపు శ్రీనివాసరావు, గొడుగు శ్రీధర్, సిరిపురపు ప్రసాద్, వందనపు సుబ్బు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు