సాక్షి, డిజిటల్ న్యూస్, నవంబర్ 1, శంకరపట్నం,, కరీంనగర్ జిల్లా, సీనియర్ జర్నలిస్ట్, బూర్ల రాజు,
వంకాయ గూడెం, కేశవపట్నం గ్రామాల సరిహద్దులోని అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది, రంగురంగుల పూలతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనేక రకాల పూలతో పాటు పండ్లు , లాంటివి స్వామివారికి సమర్పించి మెట్ల పూజ నిర్వహించారు, ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు తణుకు పట్టాభిరాములు సతీమణి తణుకు విజయ, అయ్యప్ప స్వామి భక్తులైన నార్ల శ్రీనివాస్, నార్ల వీణ, నార్ల రాహుల్, తణుకు గౌతం, తణుకు హరికృష్ణ, తనుకు రాదా, తణుకు లక్ష్మి, లతోపాటు అర్చకులు , సుమన్ శాస్త్రి భక్తులు భారీ సంఖ్యలో హాజరు కాగా అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు,