అక్టోబర్ 31, సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ జగన్, సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి నుండి విజయవాడకు వెళ్లే హైవే రహదారి మండల కేంద్రమైన వేంసూరు గ్రామం సెంటర్ నందు ప్రమాదకరమైన మూల మలుపు ఉంది. హైవే ప్రక్కన జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. స్కూల్ కి ఎదురుగా యూనియన్ బ్యాంక్ ఉంది. ఇటు బ్యాంక్ కస్టమర్లతో, అటు స్కూల్ పిల్లలతో, రాకపోక ప్రయాణికులు, అటు, ఇటు వెళ్తున్న వాహనాలతో రద్దీగా ఉన్న ఈ స్థలంలో ప్రమాదాలు గురించి, సెప్టెంబర్ నెలలో సాక్షి డిజిటల్ న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ జగన్ వ్రాసిన వార్తకు అధికారులు స్పందించి ప్రమాదాలు అరికట్టేవిషయంలో తగు జాగ్రత్తలు తీసుకోని స్పీడు బ్రేకర్లు పోయడం, బోర్డులు పెట్టడం జరిగింది. ఇందునుబట్టి పలువురు ప్రయాణికులు, వాహనదారులు అధికారులకు అభినందనలు తెలియజేసారు. అలాగే పెట్టిన బోర్డులు సరిగా కబడడంలేదు. బోర్డులు పెద్దగా ఉంటే అందరికి ఇక్కడ మూలమలుపు ఉందని తెలుసుతుందని పలువురు అభిప్రాయం తెలియజేస్తున్నారు. దయచేసి అధికారులు పెట్టిన బోర్డులు మార్చి పెద్దగా, కనబడేవిధంగా పెట్టగలరని పలువురు కోరుతున్నారు.