సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్:బొక్కా నాగేశ్వరరావు (నవంబర్ 1 2025 ) విద్యార్థులు గంజాయి, తదితర మత్తు పదార్థాల బారిన పడితే భవిష్యత్ అంధకారమవుతుందని, డ్రగ్స్ ఆరోగ్యంతోపాటు జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేస్తుందని నందిగామ ఎసిపి ఏ బి జి తిలక్ పిలుపునిచ్చారు. మారక మారక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ టీమ్స్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకు శుక్రవారం కంచికచర్ల మిక్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దివస్ కార్యక్రమంలో భాగంగా స్థానిక నెహ్రూ సెంటర్లో విద్యార్థులచే మానవహారం, ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి ఎసిపి ఏబిజి తిలక్ మాట్లాడుతూ డ్రగ్స్ ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని కూడా నాశనం చేస్తుందని, యువత తమ శక్తియుక్తులను మత్తు పదార్థాలకు అలవాటు పడి వృథా చేసుకోవద్దన్నారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. మారకద్రవ్యాల నిరోధానికి పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత పాలుపంచుకోవాలని కోరారు. మత్తు పదార్థాల భారిన పడడంవల్ల యువత బంగారు భవిష్యత్ నాశనం అవుతోందన్నారు. శారీరక, మానసిక ఆరోగ్య విచ్ఛిన్నం కావడంతో పాటు, ఆర్ధిక సమస్యలు, సమాజంలో గౌరవం లేకుండా పోతుందన్నారు. యువత ఒక్కసారి డ్రగ్స్ సేవించి పట్టుబడి కేసు నమోదైతే భవిష్యత్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు, ఏఇతర దేశాలకుకూడా వెళ్లే అవకాశం దొరకక జీవితం అంధకారంలోకి వెళ్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గంజాయిని నిర్మూలించాలనే ఈగల్ టీం ఏర్పాటు చేశారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కూడా గంజాయి సాగు చేసే అరకు ప్రాంతాల్లోకి వెళ్లి గంజాయి పంటను నిర్మూలన చేశారన్నారు. డ్రగ్స్ నిర్మూలన విద్యార్థులు, యువత చేతిలోనే ఉందన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్ నిర్మూలన కార్యక్ర మంలో భాగస్వాములై ప్రజలందరినీ చైతన్యవంతులను చేయాలని కోరారు. యువత ఉజ్వల భవిష్యత్ను నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా రూపుమాపేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపు ఇచ్చారు. దేశ ఐకమత్యం సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దర్శనికత చర్యల వల్ల లభ్యమయ్యే నాదేశ ఏకీకరణ స్ఫూర్తితో ఈ ప్రతిజ్ఞ చేస్తున్నానంటూ విద్యార్థులచే ప్రమాణం చేయించారు. డాగ్స్ వద్దు బ్రో అనే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నందిగామ గ్రామీణ సిఐ డి. చవాన్, ఈగల్ టీమ్ సీఐ ఎం. రవీంద్ర, ఎస్సైలు పి. విశ్వనాధ్, అనిల్, అభిమన్యు, రామాంజనేయులు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. వంశీ కిరణ్, పోలీసు సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
