శ్రీశైలం మండలాన్ని నూతనంగా ఏర్పాటు చేయబోయే మార్కాపురం జిల్లాలో కలపాలని ఏఐటీయూసీ,సిపిఐ నాయకుల డిమాండ్

సాక్షి డిజిటల్ న్యూస్:అక్టోబర్ 31, నంద్యాల జిల్లా,శ్రీశైలం మండలం రిపోర్టర్ కోటి. ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం పోరాట దినంగా మలిచి శుక్రవారం ఏఐటీయూసీ 31 అక్టోబర్ 1920 న స్థాపించి 106వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సున్నిపెంటలోని స్వామి రెడ్డి భవన్లో ఏఐటీయూసీ జెండాను శ్రీశైల మండల ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి ఏఐటియుసి జెండాను ఆవిష్కరించి,కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించిన సందర్భంగా నాయకులు నాగిరెడ్డి మాట్లాడుతూ ఏఐటియుసి పోరాటాల ఫలితంగా కనీస వేతనాల చట్టము,బోనస్ చట్టము, పారిశ్రామిక వివాదాల చట్టం,అనేక కార్మిక చట్టాలను పోరాడి సాధించుకున్న మొట్ట మొదటి కార్మిక సంఘం ఏఐటియుసి నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 44 చట్టాలను నాలుగు కోడలు విభజించి కార్మిక సంఘాలను పెట్టుకోకుండా,అలాగే సమ్మెకు హక్క చట్టాన్ని మార్పు చేస్తూ వ్యవసాయ చట్టాలలో కూడా మార్పు చేస్తూ కార్మికుల కు వ్యతిరేకంగా బలవంతంగా గొడ్డలి పెట్టు లాంటి చట్టాలని కార్మికల మీద రుద్దుతున్నారు.అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని తీసివేస్తూ పది గంటలకుమార్చి కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది వీటన్నిటిని కూడా ఏఐటియుసి రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తూ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుంది.అంతేకాకుండా ఆటో కార్మికులకు ఉద్యోగ భద్రత మరియు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డులో ఉన్న నిధులు జమ చేసి పెండింగ్ లో ఉన్న క్లైములు సెటిల్ చేయాలని డిమాండ్ చేశారు.అనంతరము ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పోరాట దినంగా మలిచి కార్మికులు అందరూ దాదాపు 100 మందితో స్వామి రెడ్డి భవన్ నుండి బయలుదేరి మండల తాసిల్దార్ ఆఫీస్ ముందు స్థానిక సమస్యలపై ధర్నా నిర్వహించడమైనది.ఈ ధర్నాలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు పులి రాజుగారు,సహాయ కార్యదర్శులు బాల నరసింహ,టి మల్లికార్జున,ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి గార్లు మాట్లాడుతూ గత ప్రభుత్వము జిల్లాలను ఆశాస్త్రీయంగా విడదీసి ఏర్పాటు చేయడం మూలంగా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వము ఎన్నికల సమయంలో ప్రజలకు అనుగుణంగా జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి హామీ మేరకు నేడు మంత్రివర్గ కమిటీని జిల్లాల ఏర్పాటు పై నియమించినందుకు కృతజ్ఞతలు వీటిపై నాయకులు మాట్లాడుతూ సున్నిపెంట శ్రీశైలం లింగాల గట్టు ప్రాంతాలని ప్రజల ఆకాంక్షల అభిప్రాయాల మేరకు నూతనంగా ఏర్పాటు చేయబోయే మార్కాపురం జిల్లాలో కలపాలని డిమాండ్ చేయడమైనది.ఎందుకంటే ఈ ప్రాంతము ఇప్పటికే కర్నూలు నుంచి నంద్యాల జిల్లాలకు మారిన దూరం తగ్గలా దాదాపు 160 కిలోమీటర్లు వెళ్లి వచ్చే క్రమంలో ఆత్మకూరు ఘాట్ రోడ్లో నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ జిల్లా కేంద్రానికి పోయి రావాల్సి వస్తుంది.అంతేకాకుండా సున్నిపెంటలో అటవీశాఖ పరది ఒంగోలు,కర్నూలు,నంద్యాల,పరిధిలో భౌగోళికంగా విస్తరించి ఉన్నందున ఇక్కడ సమస్యలు ఉత్పన్నమైతే అడవి శాఖ అధికారులు కు సమస్య తీర్చడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది మరియు సుండుపెంటలో ప్రభుత్వ ఆసుపత్రి లో నైపుణ్యం కలిగిన స్పెషలిస్ట్ డాక్టర్లు లేకపోవడం మూలంగా ప్రతి చిన్న జబ్బు కూడా ఇటు మార్కాపురం గాని,గుంటూరు గాని,కర్నూలు గానీ,రెఫర్ చేయడం జరుగుతోంది.ఈ ప్రయాణ సమయంలో ఎంతోమంది ప్రాణాలు మార్గమధ్యంలోనే పోగొట్టుకోవడం జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని 80 కిలోమీటర్ల దూరంలో ఉండే నూతనంగా ఏర్పాటు చేయబోయే మార్కాపూర్ జిల్లాలో సుండిపెంట లింగాల గట్టు, శ్రీశైలం ప్రాంతాలని కలిపినచో పరిపాలన పరంగా సౌలభ్యంగాను మరియు ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయుచున్నాము.కావున తమరు దయవుంచి ఇక్కడి ప్రజల ఆకాంక్షలను అభిప్రాయాలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వారి ఆకాంక్ష మేరకు ఈ శ్రీశైలం మండలం మొత్తాన్ని నూతనంగా ఏర్పాటు చేయబోయే మార్కాపురం జిల్లాలో కలపాలని కోరుచున్నాము.ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు ఆటో సంఘం లక్ష్మయ్య దేవకుమార్,శ్రీను భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి పుష్పరాజు అధ్యక్షులు అన్వర్ భాష ఏఐటీయూసీ నాయకులు శంకరు వెంకట్ మహిళా సమైక్య నాయకురాలు పాపమ్మ ఏఐవైఎఫ్ నాయకులు టి.మల్లికార్జున మహేష్ తదితరులతోపాటు వంద మంది ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *