వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై రైతుల తీవ్ర అగ్రహం

సాక్షి, డిజిటల్ న్యూస్, శంకరపట్నం, కరీంనగర్ జిల్లా, సీనియర్ జర్నలిస్ట్, బూర్ల రాజు, శంకరపట్నం మండల శాఖ వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై రైతులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు, తుఫాన్ ప్రభావంతో వందలాది ఎకరాల్లో చేతికి వచ్చిన వరి చేనులు నీలమట్టమైనాయి, రెండు రోజులపాటు కూర్చిన భారీ వర్షాలు రైతులకు తీవ్ర నష్టం కలిగించింది, కానీ వ్యవసాయ శాఖ అధికారులు నామమాత్రంగా పలు గ్రామాలు తిరిగి విరమించుకున్నట్లు రైతులు తెలిపారు, గ్రామీణ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పంట చేనులను పరిశీలించాల్సిన అధికారులు గ్రామాలు పర్యటించకపోవడంతో అధికార తీరుపై మండిపడ్డారు, కొందరు వ్యవసాయ శాఖకు సంబంధించిన కింది స్థాయి అధికారులు గల్లీ లీడర్ల అండ దండలతో విధి నిర్వహణలో సక్రమంగా పనిచేయడం లేదని విమర్శలు ఉన్నాయి, అంతేకాకుండా రైతులకు అందుబాటులో ఉండ కుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గ్రామాలు పర్యటించడం లేదని రైతులు తెలిపారు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వ్యవసాయ శాఖ పలు అధికారులపై శాఖ పరంగా చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని స్థానిక రైతులు డిమాండ్ చేశారు.