సాక్షి డిజిటల్ న్యూస్ నాగర్ కర్నూల్ జిల్లా/ బిజినపల్లి మండలం: 31 అక్టోబర్ 2025: (రిపోర్టర్ కొంకాళి మధుసూదన్): మండల కేంద్రంలో భవన నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు విద్యుత్ షాక్ గురైన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. డిసిసిబి బ్యాంకు పక్కన నిర్మాణంలో ఉన్న ఇంటి పై కప్పు కోసం ఇనుప చువ్వలను పైకి లాగే క్రమంలో ఇంటి ముందున్న హై టెన్షన్ విద్యుత్ తీగలు తగిలి కార్మికులు విద్యుత్ షాక్ గురయ్యారు. ఈ ప్రమాదంలో షైన్ పల్లికి చెందిన శ్రీనివాసులు తీవ్ర గాయాలు కాగా, పోలేపల్లి కి చెందిన యాదయ్య బిజినపల్లి చెందిన చెన్నయ్యలు స్వల్ప గాయాలతో ప్రమాదం నుండి బయటపడ్డారు. గాయపడ్డ వీరిని 108 లో నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. గాయపడ్డ వీరిలో శ్రీనివాసులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.