విద్యలో ఉత్తమ ప్రతిభ కనపరిస్తే నాలాంటి అధికారిగా ఎదుగుతారు.

★ స్పెషల్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి.

సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31 తంబల్లపల్లి మండల రిపోర్టర్ ఇ. రమేష్ బాబు. ప్రతి విద్యార్థి కష్టపడి క్రమశిక్షణతో కూడిన విద్య అభ్యసించి ఉత్తమ ప్రతిభ కనబరిచితే నాలాంటి పెద్ద అధికారిగా ఎదుగుతారని విద్యార్థులకు తంబళ్లపల్లె నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి హిత బోధ చేశారు. శుక్రవారం ఆయన తంబళ్లపల్లి మోడల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ చేసి టెన్త్ విద్యార్థుల క్లాసులో అధ్యాపకుడిగా మారాడు. విద్యార్థుల విద్యా బోధన, పాఠశాల అధ్యాపకుల పనితీరు, మధ్యాహ్న భోజన సౌకర్యాల పై ఆరా తీసి టెన్త్ సబ్జెక్టుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించి సరైన సమాధానాలు రాబట్టుకున్నారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో కష్టపడి చదివి టెన్త్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసి కుకింగ్ కమిటీ తోబాటు ఆధ్యాపక బృందాన్ని ప్రశంసించారు. ఆయన వెంట డిప్యూటీ ఎంపీడీవో ఈశ్వర్ రెడ్డి, మోడల్ స్కూల్ అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.