వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీఎమ్మెల్యే బండారు

సాక్షి డిజిటల్ న్యూస్ 31 అక్టోబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు దేవరాపల్లి, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మండలంలో ఏర్పాటు చేసిన పునరావాస ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మండల స్థాయి అధికారులు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గరిసింగి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ గొడుపు రాము అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, మండల టిడిపి అధ్యక్షులు పెద్దడ వెంకటరమణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి దొగ్గ దేముడు నాయుడు, టిడిపి మాజీ ప్రధాన కార్యదర్శి శరకన సూర్యనారాయణ, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు గేట్రీడి కొండలరావు, తాసిల్దార్ పి లక్ష్మీదేవి, డిప్యూటీ తాసిల్దార్ టి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.