సాక్షి డిజిటల్ న్యూస్: నవంబర్ 1, ( ప్రకాశం జిల్లా బ్యూరో ఇన్చార్జి: షేక్ మక్బూల్ భాష). మహిళపై బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో, మరియు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితుడికి రెండు సంవత్సరాల జైలుశిక్ష తో పాటు రూ.10,000 జరిమానా విధించిన ఏడవ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి. పొదిలి మండలంలోని ఆముదాలపల్లి గ్రామానికి చెందిన మహిళ “ఎస్తేరు రాణి”, తండ్రి దావీదు, 23 సం(ఎస్సీ) అను ఆమె చీమకుర్తిలోని జవహర్ హాస్పటల్లో ఏ.ఎన్.ఎమ్ గా పనిచేస్తూ తేదీ 29.10.2021 సాయంత్రం 5:30 సమయంలో ఆముదాలపల్లికి వెళ్ళటానికి పొదిలిలో ఆటో ఎక్కగా ఆటో డ్రైవరు మరియు ముద్దాయి నంది రెడ్డి ఓబుల్ రెడ్డి,వయసు (35 సo)ఆముదాల పల్లి గ్రామము, పొదిలి మండలము అను అతను ఎస్తేరు రాణి యెడల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ బలవంతంగా లైంగిక వేధింపులు చేయడానికి పాల్పడినట్లు పొదిలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడంతో, ఇవ్వబడిన రిపోర్టు మేరకు పొదిలి పోలీస్ స్టేషన్ సీఆర్.నెం. 318/2021 యు/ఎస్ 354 (ఏ) ఐపీసీ, సెక్షన్ 3 (1)(ఆర్), సెక్షన్ 3 (1) (ఆర్), సెక్షన్ 3 (1) (డబ్ల్యూ)(2), 3 (2) (వ) ఎస్సి /ఎస్టీ పిఓఏ యాక్ట్ గా అప్పటి పొదిలి యస్.ఐ వై. శ్రీహరి కేసు నమోదు చేయగా, అప్పటి దర్శి డిఎస్పీ వి.నారాయణస్వామిరెడ్డి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసి రిమాండుకు పంపించి, కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసారు.అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.ప్రశాంతి కుమారి ప్రాసిక్యూషన్ తరుపున వాదించారు. పోలీస్ సిబ్బంది సాక్షులను కోర్ట్ లో సమయానుసారం హాజరు పరుస్తూ ప్రకాశం జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో పటిష్టమైన గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా సమర్థవంతంగా విచారణ నడిపి సరైన సాక్ష్యాధారాలతో నిందితుడిపై నేరనిరూపణ చేసినందున తేది 30.10.2025 న ఒంగోలు ఏడవ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి “టి.రాజా వెంకటాద్రి” నిందితుడికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష మరియు 10,000/- రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.సదరు కేసులో సరైన సాక్ష్యాధారాలు కోర్ట్ లో ప్రవేశపెట్టి సమర్థవంతంగా ట్రయల్ మానిటరింగ్ చేసి నిందితుడు శిక్షించబడటంలో క్రియాశీలక పాత్ర పోషించిన అప్పటి ఎస్సై శ్రీహరి, అప్పటి దర్శి డిఎస్పీ వి.నారాయణస్వామిరెడ్డి, కోర్టు లైజన్ హెడ్ కానిస్టేబుల్ ఏ. శ్రీనివాసులు, కానిస్టేబుల్ ఎమ్.హరికృష్ణ, పొదిలి పోలీస్ స్టేషన్ కోర్టు సిబ్బంది అయిన హెడ్ కానిస్టేబుల్ ఏ.వి.శేషయ్య, కానిస్టేబుల్ యు.రాజారత్నం లను ప్రకాశం జిల్లా ఎస్పీ “వి.హర్షవర్ధన్ రాజు” ప్రత్యేకంగా అభినందించారు.