సాక్షి డిజిటల్ న్యూస్ 31 అక్టోబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, ముంధా తుఫాన్ ప్రభావంతో
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైవాడ జలాశయానికి వరద నీరు పోటెత్తాడంతో జలాశయం రెగ్యులేటింగ్ గేట్ల నుంచి శారద నదిలోకి వరద నీటిని జలాశయం అధికారులు విడుదల చేశారు. జలాశయం అత్యధిక నీటిమట్టం 114 మీటర్లు కాగా, 113.50 మీటర్లకు చేరడంతో వరద నీటిని భారీగా దిగువగు విడుదల చేశారు. మూంథా తుఫాన్ ఎవరికి ఎటువంటి ప్రమాదం, సంఘటనలు జరగకుండా మండల అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టారు. తుఫాన్ ప్రభావాన్ని ముందస్తు చర్యలుగా అధికారులు ప్రచారం చేయడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. దీంతో రైవాడ జలాశయం నుంచి విడుదలైన నీటిని జలశయం అధికారులు ప్రస్తుత నీటిమట్టం 112 10 వద్ద నమోదు కావడంతోశుక్రవారం నాలుగు గేట్లు మూసివేసి నీటిని నిలుపుదల చేశారు. తుఫాన్ కారణంగా జలాశయం డి ఈ ఆర్. సత్యం నాయుడు, జె ఈ ఈ కె. నాగేంద్ర. నందకిషోర్ ఇరిగేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు జలాశయం వద్ద పర్యవేక్షణ చేసి వచ్చిన వరద నీటిని శారదా నదిలోకి విడుదల చేసేవారు