సాక్షి డిజిటల్ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా/ తెలకపల్లి మండలం; 31 అక్టోబర్ 2025; (రిపోర్టర్ కొంకలి మధుసూదన్): తెలకపల్లి మండల కేంద్రంలోని లైబ్రరీ లో తాత్కాలిక ఉద్యోగితో కొనసాగుతుంది దాదాపుగా 9 సంవత్సరాల నుండి ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమితులైన లైబ్రేరియన్ అరుంధతి వారానికి ఒకసారి వస్తుండడంతో లైబ్రరీ సేవలు కొనసాగుతున్నాయి మండల కేంద్రంలో ఉన్న నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధపడేవారు విశ్రాంత ఉద్యోగులు నిరంతరం 50 నుండి 100 మంది లైబ్రరీ సేవలు వినియోగించు కుంటున్నారు ఈ సమయంలో ఏర్పడుతున్న ఆటంకాలు సరైన పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు ఎన్నో సంవత్సరాలుగా మండల కేంద్రంలో ఉన్నవారికి లైబ్రరీ తన సేవలను అందిస్తుంది ఇంతకుముందు పనిచేస్తున్న లైబ్రేరియన్ రాజ్యలక్ష్మి 2017లో లో తన పదవి కాలాన్ని ముగించుకుని రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పటివరకు నియమకాలు చేపట్టలేదని అదేవిధంగా సదుపాయాలను కల్పించమని ఎవరికి తెలియజేయాలో కూడా అర్థం కావడంలేదని నిరంతరం లైబ్రరీ సేవలు వినియోగించుకుంటున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా నిరుద్యోగ యువతను పోటీ పరీక్షలకు హాజరయ్యే వారిని దృష్టిలో ఉంచుకుని తెలకపల్లి లో ఉన్న ఈ లైబ్రరీకి రెగ్యులర్ ఉద్యోగిని నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు 2017లో రిటైర్మెంట్ అయిన లైబ్రేరియన్ రాజ్యలక్ష్మి ఇప్పటివరకు రెగ్యులర్ ఉద్యోగి లేకపోవడంతో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న నేనే అన్ని సౌకర్యాలను మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని చాలీచాలని జీతాలతో ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నామని ప్రభుత్వం మాపైన దృష్టి ఉంచి మమ్మల్ని రెగ్యులర్ చేసి ఇన్నేళ్ల సర్వీస్ ని నష్టపోకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.