రుద్రూర్ పోలీస్ ఆధ్వర్యంలో ఏక్తా దివస్ వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్ 1 నవంబర్ 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (షేక్ గౌస్ సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి ) సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని రుద్రూర్ పోలీసులు నిర్వహించారు. కుల, మత, వర్గ, లింగ విభేదాలు లేకుండా ప్రజలందరూ ఐకమత్యంతో మెలుగుతూ జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని రుద్రూర్ ఎస్సై సాయన్న, ఫుడ్ సైన్స్ కాలేజ్ అసోసియేట్ డీన్ డాక్టర్ కె వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రుద్రూర్ పోలీసులు, ఫుడ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ‘జాతీయ సమైక్యత దినోత్సవం’ (రాష్ట్రీయ ఏక్తా దివస్) నిర్వహించారు. ​ఈ సందర్భంగా నిర్వహించిన జాతీయ సమైక్యత ర్యాలీని ఎస్సై సాయన్న జెండా ఊపి ప్రారంభించారు. రుద్రూర్ బస్టాండ్ నుండి ప్రారంభమై అక్బర్ నగర్ గ్రామం వరకు ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ఎస్ఐ సాయన్న మాట్లాడుతూ భారతదేశాన్ని 564 సంస్థానాలుగా విడిపోయి ఉన్న దేశాన్ని ఒక్కటిగా చేసి ఏకతాటిపై నడిపించిన మహనీయుడు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర అద్భుతమని అయన కొనియాడారు. ఆయన సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని దేశ సమైక్యతకు, సమగ్రతకు కృషి చేయాలని ఉద్బోధించారు. అంతర్గత భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, జాతీయ ఐక్యత లో భాగం కావాలని ఎస్ఐ సాయన్న ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సైన్స్ కాలేజ్ ప్రోగ్రామ్ ఇన్చార్జ్ ప్రశాంతి, పోలీస్ సిబ్బంది, ఫుడ్ సైన్స్ కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులు, వివి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *