సాక్షి డిజిటల్ న్యూస్ 31 అక్టోబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. అనంతరం ఈ పోటీల్లో పాల్గొన్న విజేతలను ప్రకటించారు. మండల స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో ఎస్ వి ఎస్ మేఘన (కాశీపురం), జి.వనజ (దేవరాపల్లి), ఎస్. వర్షిని (ఎం. అలమండ) విజేతలుగా నిలిచారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు నవంబర్ 3న మాడుగులలో నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఉషారాణి, ఉమా ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.