సాక్షి డిజిటల్ నవోంబర్ 01 ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి అజయ్ : జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన గాదె రాజన్న భార్య గాదె రాజవ్వ మోకాలి శస్త్ర చికిత్స కు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉండగా నిమ్స్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిమిత్తం 1 లక్ష 50 వేల రూపాయలు విలువగల చెక్కును జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ . ఈ కార్యక్రమంలో నాయకులు గంగన్న, గాదె రాజన్న,మోతే రాజన్న,ఏనుగుల రాజు ,తదితరులు పాల్గొన్నారు.