భారత ప్రధానిగా ఇందిరాగాంధీ సేవలు మరవలేనివి

సాక్షి డిజిటల్ న్యూస్, కారేపల్లి, అక్టోబర్ 31, కాంగ్రెస్ పార్టీ మహిళ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు ప్రధానిగా ఇందిరా గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఈరోజు అమరురాలైన భారత తోలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ కి నా నివాళి వ్యవసాయం ఆర్థిక సైనిక శక్తి రంగం ఏదైనా భారత్ ను బలమైన దేశంగా మార్చడంలో ఆమె చేసిన కృషి సాటి లేనిది. ఈరోజు కారేపల్లి లో రాజీవ్ గాంధీ బస్ బస్టాండ్ సెంటర్లో ఇందిరా గాంధీకీ పుష్పాంజలి ఘటించారు. బంగ్లాదేశ్ విముక్తి నుంచి హరిత విప్లవానికి నాంది పలికే వరకు అన్ని ఎత్తుపల్లాలోనూ ఇందిరా గాంధీ దేశాన్ని నడిపించారు. దేశాభివృద్ధి కోసం ఆమె చూపిన తిరుగులేని దృక్పథానికి సెల్యూట్ చేస్తున్నాం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారతమాత సమైక్యత కోసం రక్తార్పణ చేసిన ఇందిరా గాంధీ అపూర్వ ధైర్య సహసాలు, అనితార సాధ్యమైన వ్యూహాలు దేశం కోసం ప్రజా త్యాగం చేసిన ధీరోదాత్త నాయకురాలుగా భారతదేశ చరిత్రలో నిలిచిపోయారని భారతదేశాన్ని నిత్య చైతన్య స్ఫూర్తి పదంలో ఉంచి గరీబి హటావో, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయం 20 సూత్రాల లాంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ ప్రగతి కోసం పాటుపడి , పేదరిక నిర్మూలకై కృషి చేసిన భారతదేశపు మొదటి మహిళా ప్రధాని భారతరత్న ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా వారి సేవలను గురించి సింగరేణి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ లావుడ్యా రాజ్ కుమార్ నాయక్,షేరు ధారావత్ రమేష్ నాయక్, గూగులోతు గోపాల్ నాయక్, గూగులోతు భద్రు నాయక్, టౌన్ ప్రెసిడెంట్ పోలగాని శ్రీనివాసరావు, ఆదేర్ల రాములు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకుల పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *