భారతదేశ సమగ్రతకు ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్

సాక్షి డిజిటల్ న్యూస్ తేదీ 31 అక్టోబర్ 2025 యాదాద్రి జిల్లా గుండాల మండలం రిపోర్టర్ ఎండి ఉస్మాన్
జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా,ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని పునఃస్కరించుకొని గుండాల మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు స్థానిక ఎస్సై తేజంరెడ్డి జండా ఊపి శ్రీకారం చుట్టారు స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు యువతతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. దేశ ఐక్యతను ప్రతిబింబించేలా ఉత్సాహంగా పరిగెత్తారు.ఈ సందర్భంగా ఎస్సై తేజం రెడ్డి సర్దార్ వల్ల భాయ్ పటేల్ చిత్రానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత దేశ సమగ్రతకు ప్రతీక స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి 550 సంస్థలను భారతదేశంలో విలీనం చేసిన ఉక్కుమనిషి ఆయన దృఢ సంకల్పం దేశభక్తి మనందరికీ స్ఫూర్తి దేశ ఐక్యతను కాపాడుతూ.ఆయన ఆశయాల దిశగా మనందరం కృషి చేయాలని అన్నారు అనంతరం జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాము వైస్ ప్రిన్సిపాల్ రమేష్ సోమయ్య పృద్వి రాజేందర్ సురేష్ పిటి మహేష్ దశరథ పోలీస్ సిబ్బంది ప్రశాంత్ గౌడ్ సైదులు గౌడ్ నరేష్ ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.