సాక్షి డిజిటల్ న్యూస్ 31 అక్టోబర్2025 నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం రిపోర్టర్ రాంబాబు ఆపదలో ఉన్నవారి ప్రాణాలు నిలిపే ఒక మహోన్నత వేదిక కావాలని భావించి కేజిఆర్ విద్యా సంస్థల సహకారం తో ఫ్రెండ్స్ ఫర్ సేవా మరియు ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం మరియు గర్భిణీ మహిళల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కేజీఆర్ కళాశాల అధినేత రామచంద్రారెడ్డి,నంద్యాల బ్లడ్ సెంటర్ మేనేజర్ బ్లడ్ అచ్చు,ముల నాగేశ్వర్ రెడ్డి, (లాయర్ బాబు) ఫ్రెండ్స్ ఫర్ సేవా ఫౌండర్ రాగురు ఫణింద్ర, చైర్మన్ విష్ణు గాయత్రి లు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి అవసరమైన వారికి గ్రూపు సంబంధించిన రక్తం లభించక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకుంటుడటం తో పాటు ఫ్రెండ్స్ ఫర్ సేవా మరియు స్థానిక ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ సభ్యులు చేస్తున్న కార్యక్రమాలు ఎంత అమోఘం అని యువకులు సమాజంలో చెడు అలవాట్లకు దూరమై ఇటువంటి మంచి కార్య క్రమాలకు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తూ, ఇలాంటి కార్యక్రమాలలో ముందు ఉండి, ప్రోత్సాహించాలని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఒకరిని చూసి ఇంకొకరు కార్య క్రమాలు చేయాలని ఆసక్తి వస్తుందని చెప్పారు.రక్తదాన కార్యక్రమంలో యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేయడం జరిగిందని అలాగే రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ సేవా బ్లడ్ డైరెక్టర్ బాబుజి నాయక్, సభ్యులు కిషోర్,బ్లడ్ అచ్చు, ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ప్రతినిధి షాషావలి, ఉదయ్, మణి, మౌలా, హరీష్, కేజీఆర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
