సాక్షి డిజిటల్ న్యూస్. అక్టోబర్ 31. 2025. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం విలేకర్. మామిడి విజయ్. జన్నారం మండలం తో పాటు ఖానాపూర్ నియోజకవర్గం లో అనేక మండలాలు తుఫాన్ ప్రభావంతో చేతికి అంది వచ్చిన పత్తి వడ్లు సోయా మొక్కజొన్న అపరాల పంటలతో పాటు కూరగాయల పంటలు భారీగా దెబ్బతిన్నాయి రైతులు గత కొద్ది కాలంగా యూరియా కొరతతో ఇబ్బందులు పడిన వెనువెంటనే నెలరోజుల వ్యవధిలో అకాల వర్షాల ద్వారా ప్రభుత్వం ముందు చూపు లేకుండా గిడ్డంగులలో ఏర్పాట్లు చేయకపోవడం టార్చ్లైన్ కవర్స్ అందుబాటులో ఉంచకపోవడం వడ్లు కొనుగోలు చేయడంలో జాప్యం వహించడం ముందస్తు గా రైతులకు పండిన పంటలు తడవడంతో తడిసిన పంటను వెంటనే ప్రభుత్వం మద్దతు ధరతో కొనాల్సిన పరిస్థితి ఉందని భుఖ్య జాన్సన్ నాయక్. ఖానాపూర్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ ఇంచార్జ్ ప్రభుత్వానికి మనవి చేశారు. గత పది సంవత్సరాలలో .కెసిఆర్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందని వరి కల్లాలను పొలం వద్దనే నిర్మించి బస్సుల ద్వారా ప్రత్యేకంగా రైతుకు వడ్ల బస్తాలను తీసుకుపోయే విధంగా సౌకర్యాలను ఏర్పరిచింది అన్నారు