సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ రామని గణేష్ ఇదిగానిపల్లి 31-10-2025, జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని రాజాపూర్ మండలం కేంద్రంలోని కుచ్చర్కల్ గ్రామనికి చెందిన కరికే మన్యం కూతురు రిషిక వివాహానికి ఆడబిడ్డ పెండ్లికి అడిగిన వెంటనే చిరు సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా10,000/- రూపాయల అందించిన జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడు అభిమన్యు రెడ్డి. అనంతరం సహాయం పొందుకున్న కుటుంబ సభ్యులు అభిమన్యు రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ముందు ముందు రాబోయే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు మా గ్రామానికి చేయాలని గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాకర్ గౌడ్, నర్సింలు, రఘునాథ్, శేఖర్, నవీన్, విరాట్, బాలు, రాజేష్ గౌడ్, మంగలి నరసింహులు గ్రామస్తులు మరియు బీఆర్ఎస్ నాయకులు, యువసేన నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.