సాక్షి డిజిటల్ న్యూస్: 31 అక్టోబర్,పాల్వంచ.రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలంలో,జిల్లా ఎస్పీ రోహిత్ రాజు నేతృత్వంలో, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, సిఐ.సతీష్ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నుండి అల్లూరి సెంటర్ వరకు, తిరిగి అల్లూరి సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు “రన్ ఫర్ యూనిటీ” పేరుతో 2కె రన్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ.సతీష్ మాట్లాడుతూ, ఐకమత్యానికి నిదర్శనం “రన్ ఫర్ యూనిటీ” అని,2కె రన్ వలన ఐకమత్యం బలపడుతుందని,సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవాలని,ఆయన ఐక్యతకు దిక్సూచి అని అన్నారు. ఈ 2కె రన్ లో 400 మంది విద్యార్థులు, పట్టణ ప్రజలు,పోలీస్ సిబ్బంది, కేటిపిస్ ఎస్పీఎఫ్ సిబ్బంది సహా 600 మంది వరకు పాల్గొన్నారు.ఈ 2కె రన్ లో పాల్వంచ ఎస్ఐలు సుమన్, జీవన్ రాజ్, కళ్యాణి, ఎస్పీఎఫ్ ఎస్ఐ మహ్మద్ భీరా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షుడు డాక్టర్ యుగంధర్ రెడ్డి, పాల్వంచ టెన్నిస్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, పి.డిలు శ్వేతా, డేనియల్ తదితరులు పాల్గొన్నారు.