సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద అక్టోబర్ 31, దేవరగట్టు ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది చైర్మన్ గా కురువ వీర నాగప్ప, వైస్ చైర్మన్ గా లోక్సత్తా నాయక్ ను ఎన్నుకోవడం జరిగిందని ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్ తెలిపారు ముందుగా దేవరగట్టు మల్లేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా శుక్రవారం వైకుంఠం జ్యోతి వైకుంఠం శివప్రసాద్ ఆలయ కమిటీ చైర్మన్ వీరనాగప్ప లు మాట్లాడుతూ దేవరగట్టు ఆలయ చైర్మన్ గా ఈసారి నేరనికి నేరనికితాండ కొత్తపేట గ్రామాల దేవరగట్టు ఆలయ కమిటీ ని చైర్మన్గా ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అలాగే గర్వతగ్గ విషయమని ఆలయ చైర్మన్ వీర నాగప్ప అన్నారు గత పాలనకు భిన్నంగా దేవరగట్టు ఆలయ అభివృద్ధికై నూతన కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆలూరు తేదాపా ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవరగట్టు శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి ఆలయ ప్రధాన రహదారి కోసం దాదాపుగా కొన్ని రోజుల్లోనే కోటి రూపాయలు ప్రభుత్వం ద్వారా అందించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా రహదారిని నిర్మిస్తామని వైకుంఠం జ్యోతి తెలిపారు దేవరగట్టు లో భక్తులు వేసిన హుండీలో ప్రతి ఒక్క రూపాయి ఆలయ అభివృద్ధి కోసమే ఉపయోగించుకోవాలని సూచించారు దేవరగట్టు అభివృద్ధి కోసం తన వంతుగా తన కుటుంబం కూడా సహాయ సహకారాలు ఉంటాయని వారు అన్నారు అలాగే దేవరగట్టులో త్రాగునీరు కమిటీ హాల్ భక్తులకు అవసరమయ్యే వసతులు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ చర్చించి త్వరలోనే ఆ పనులు కూడా చేపడతామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవరగట్టు ఆలయ పురోహితులు పూజారులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈ బిజీ గోవింద్ గౌడ్ ఆలూరు మార్కెట్ యార్డు చైర్మన్ బిలేకల్ వెంకటేష్, యువ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య జెకె.రహిమాన్, వలి భాషా వీరన్నగౌడ్ సిబిఎన్ ఆర్మీ మోయిన్ దొడ్డి తిక్కస్వామి మల్లికార్జున మూడు గ్రాముల ప్రజలు తమ తాలూకా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
