సాక్షి డివిజన్ న్యూస్ రిపోర్టర్: బొక్కా నాగేశ్వరరావు, (నవంబర్ 1 2025) పొక్కునూరు గ్రామంలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చందర్లపాడు మండలం పొక్కునూరు గ్రామంలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను, వరుసగా కురుస్తున్న వర్షాలు, బలమైన ఈదురుగాలుల కారణంగా పత్తి పంటలు దెబ్బతిన్నాయి. రైతుల ఆవేదనను స్వయంగా తెలుసుకునేందుకు శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులు, లాల్ బహుదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు మరియు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి పొక్కునూరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో ఆమె పత్తి పొలాల్లోకి వెళ్లి పంట పరిస్థితిని పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పత్తి పంటలు తడిసి, చెట్లపై తెగుళ్లు ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా కుంగిపోకుండా ప్రభుత్వం మీతో ఉంది. ప్రతి ఎకరాకు నష్టం అంచనా వేసి, తక్షణమే సహాయ నివేదికను సిద్ధం చేయమని అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగినట్లు తెలియజేశారు.