సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 01,రాయికల్, వై. కిరణ్ బాబు జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం, మండలం లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి పంట మొత్తం నెలవారీ నీటిపాలైందని వారం రోజులు అయితే పంట చేతికి వస్తుందని ఆశపడ్డ రైతులకు మోoథా తుఫాన్ వల్ల నిరాశ మిగిలిందని కేవలం రాయికల్ పట్టణంలోనే కాకుండా మండలంలోని అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందని రాష్ట్ర ప్రభుత్వం వెను వెంటనే యుద్ధ ప్రాతిపదికన పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరానికి ₹40,000 చొప్పున నష్టపరిహారాన్ని అందించాలని రాయికల్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి కోరారు.ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం పై చిత్తశుద్ధి లేకనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయడం లేదని కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ హామీకి అనుగుణంగా సమగ్ర పంటల భీమా పథకాన్ని కూడా తీసుకురాలేదని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో రైతులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపి పట్టణ అధ్యక్షులు కుర్మ మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి కునారపు భూమేష్, ఉపాధ్యక్షులు అల్లే నర్సయ్య, సింగని సతీష్, ఎల్లాగౌడ్, కార్యదర్శి చంద రమేష్, కైరం సుదర్సన్,మచ్చ శంకర్ ఐటీ సెల్ కన్వీనర్ కట్కం కిషోర్ తదితరులు పాల్గొన్నారు.