సాక్షి డిజిటల్ న్యూస్,కామేపల్లి (అక్టోబర్ 31) : తుఫానుతో దెబ్బతిన్న పత్తి,మిర్చి,వరి తదితర పంటల రైతులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే భరోసా కల్పించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్,బొంతు రాంబాబులు డిమాండ్ చేశారు.శుక్రవారం కామేపల్లి మండల వ్యాప్తంగా తుఫానుకు దెబ్బతిన్న పత్తి,వరి, మొక్కజొన్న పంటలను సిపిఎం పార్టీ,రైతు సంఘం బృందం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం,రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరానికి రూ. 50 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.20 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు.కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు ఆదుకోకపోతే రైతులు దివాలా తీసి ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వాలు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరారు.ఈ పర్యటనలో సిపిఎం పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి,పార్టీ జిల్లా నేత భూక్యా వీరభద్రం, వైరా డిజన్ కమిటీ నాయకులు చింతనిప్పు చలపతిరావు, బాదావత్ శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా నాయకులు వరప్రసాద్, ప్రతాపనేని వెంకటేశ్వరరావు, కొంగర సుధాకర్,రుద్రాక్షల నరసింహ చారి, సత్యనారాయణ, ఉప్పుతల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.