డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

సాక్షి డిజిటల్ న్యూస్ 1 నవంబర్ 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (షేక్ గౌస్ సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి ) రుద్రూర్ మండలం రాణంపల్లి గ్రామంలో గత ప్రభుత్వంలో ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం లబ్ధిదారులకు బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం తన స్వగృహం బాన్సువాడలో చెక్కులను పంపిణీ చేసినట్టు సీనియర్ నాయకులు నేరుగంటి బాలరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పేదోడి సొంతింటి కలను సహకారం చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా బాన్సువాడ నియోజక వర్గంలో అత్యధికంగా ఇండ్ల నిర్మాణం చేపట్టి దాదాపు 13 వేల ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం మారిన నేనున్నానని భరోసా కల్పించి లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేసిన శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, పత్తి రాము, అక్కపల్లి నాగేందర్, కొండల్ వాడి శంకర్, పత్తి లక్ష్మణ్, నేరుగంటి బాలరాజు, గాండ్ల రమేష్, సుదర్శన్ గౌడ్ లబ్ధిదారులు పాల్గొన్నారు.