సాక్షి డిజిటల్ న్యూస్:31 అక్టోబర్,పాల్వంచ.రిపోర్టర్: కె.జానకిరామ్. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార నిమిత్తం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలంకు చెందిన టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గద్దల రమేష్ ను షేక్ పేట్ డివిజన్ ఇంచార్జిగా నియమించారు.ఈ మేరకు తెలంగాణ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు,ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం ఉత్తర్వులు విడుదల చేశారు.ఈ సందర్భంగా గద్దల రమేష్ మాట్లాడుతూ,తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రీతంకు కృతజ్ఞతలు తెలిపారు.షేక్ పేట్ డివిజన్ పరిధిలో గల గడపగడపకు వెళ్లి,రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా అహర్నిశలు పనిచేస్తానని,షేక్ పేట్ డివిజన్ బూత్ లలో అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు.గద్దల రమేష్ నియామకం పై రాష్ట్ర నాయకులు,వివిధ జిల్లాల నాయకులు,కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.