జాతీయ సమైక్యతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి….

★ఆర్కేపి ఎస్సై జి రాజశేఖర్ ★సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా ర్యాలీ….★మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు

సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 31, రామకృష్ణాపూర్: కుల, మత ,వర్గ, లింగ బేధాలు లేకుండా ప్రజలందరూ ఐకమత్యంతో మెలుగుతూ జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై జి రాజశేఖర్, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు లు పిలుపునిచ్చారు. భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు హాజరయ్యారు. పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియం నుండి 2 కే రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. రన్ లో పట్టణ పోలీసులు, విద్యార్థులు, యువతతో పాటు పలు రాజకీయ, సామాజిక సంఘాల నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఐక్యత స్ఫూర్తితో సమాజంలో శాంతి సహకారం నెలకొల్పేలా ప్రజలు కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.