సాక్షి డిజిటల్ న్యూస్ 1 2025 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి, జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని ఐక్యత పరుగుకార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి పోలీస్ అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మరియు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ఐక్యత పరుగు న్యూ బస్ స్టాండ్, ఆర్డీవో చౌరస్తా,ఓల్డ్ బస్ స్టాండ్ మీదుగా మినీ స్టేడియం వరకు కొనసాగింది.అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఇదే తరహా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ సర్దార్ పటేల్ దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన ఐక్యత సూత్రధారి.ఆయన స్ఫూర్తితో మనమూ సమాజంలో ఐక్యత, సామరస్యం నెలకొల్పాలి అన్నారు. ప్రతి పౌరుడు దేశ సమగ్రతను కాపాడే బాధ్యతను తీసుకోవాలిఅన్నారు కార్యక్రమం ద్వారా దేశ భక్తిని,ఐక్యతను ప్రజల్లో యువతలో జాతీయతా భావం పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంఅన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, జాతీయ స్ఫూర్తిని పెంపొందించడంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందిఅని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, ఎస్‌బీ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్,రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సైదులు,వేణు,సి.ఐ లు రవి, కరుణాకర్,అలాగే ఎస్‌ఐలు,పోలీస్ సిబ్బంది,విద్యార్థులు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.