జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం

సాక్షి డిజిటల్ న్యూస్, 31oct ఫరూక్ నగర్ రిపోర్టర్ కృష్ణ టిడబ్ల్యూజేఎఫ్ షాద్ నగర్ డివిజన్ అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్ సీనియర్ జర్నలిస్ట్ కేపీని మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు షాద్ నగర్ టిడబ్ల్యూజెఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ఎంపిక షాద్ నగర్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులుగా ఆంజనేయులు గౌడ్, సాయి కుమార్ రెడ్డి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ షాద్ నగర్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. షాద్ నగర్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా ఆంజనేలు గౌడ్ ( ప్రైమ్ 9), ప్రధాన కార్యదర్శిగా సాయినాథ్ రెడ్డి (ఆర్ టీవీ), ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, ఖాజాషోయెల్, గౌరవ అధ్యక్షులుగా రాజేష్ ( రాజ్ న్యూస్), కోశాధికారులుగా జగన్, కృష్ణ, రియాజ్ లు, సహాయ కార్యదర్శులు గా ఆవుల రమేష్ , విష్ణు, షకీల్, రవితేజ, సలహాదారులుగా మొయిజ్ , మచ్చేందర్, కార్యవర్గ సభ్యులుగా శ్రీకాంత్, మాజీద్, గిరిబాబు, మల్లేష్, మురళి, ఇక్బాల్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీకి టిడబ్లుజెఫ్ రాష్ట్ర నాయకులు సీనియర్ జర్నలిస్ట్ ఖాజపాష (కేపి), అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్, ఎండి సలీంలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవహరిస్తుందని అన్నారు. జర్నలిస్టులకు అండగా నిలబడతావని అన్నారు. ఐక్యతతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎలక్ట్రానిక్ మీడియా అభివృద్ధికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని తెలిపారు..