జన్నారం పోలీస్ ఆధ్వర్యంలో 2కే రన్ ప్రారంభం

★సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా.

సాక్షి డిజిటల్ న్యూస్. అక్టోబర్ 31. 2025. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్. జన్నారం మండలంలోని సీనియర్ సిటిజన్ యువత విద్యార్థిని విద్యార్థులు స్థానిక మండల వాసులు ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పోలీస్ స్టేషన్ సిబ్బంది అన్ని గ్రామాలలోని వ్యాయామ విద్యార్థిని విద్యార్థులు ఉదయపు పూట నడక అభిలాషీలు భారీగా పాల్గొని స్థానిక జన్నారం మండలంలోని పోలీస్ స్టేషన్ నుండి స్టేట్ బ్యాంక్ వరకి 2కె రన్ ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభించి మళ్లీ పోలీస్ స్టేషన్ వరకు రన్ ను నిర్వహించారు. వ్యాయామం అనేది మానసిక శారీరక ఉల్లాసానికి దోహదపడుతుందని పోలీసు ఉన్నతా ధికారులు తెలిపారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కుమనిషి భారత దేశపు హోంశాఖ అధినేతగా భారతదేశాన్ని ఒక క్రమ పద్ధతిలో నిలిపిన వ్యక్తిగా ఉంటారని ఈరోజు జన్మదిన సందర్భంగా టూ.కే రన్ నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు బావి భవిష్యత్తు భారత దేశ పోలీస్ ఉద్యోగ నియామకానికి ఆర్మీ ఉద్యోగ నియామకానికి యువత ముందుకు వచ్చి ఉదయపు పూట నడకతో పాటు రన్నింగ్ ను చేయాలి అన్నారు