సాక్షి డిజిటల్ న్యూస్ 31అక్టోబర్ 25 జమ్మికుంట టౌన్ రిపోర్టర్ తంగళ్ళపల్లి శ్యామ్ కిషోర్, ఇటీవల మరణించిన సాహితీ వాటర్ ప్లాంట్ చంద్రశేఖర్ కుటుంబానికి జమ్మికుంట టౌన్ వాటర్ ప్లాంట్ యూనియన్ సభ్యులు అండగా నిలిచారు. యూనియన్ సభ్యులు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా, మానవతా దృక్పథంతో యూనియన్ తరపున ₹ 11,500/- (పదకొండు వేల ఐదు వందల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని వారికి అందజేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు నరేష్, సంతోష్, శ్రీను, ప్రసాద్, చందు, సంపత్, సంతోష్, రాజు, రాజేంద్రప్రసాద్, రాజేశ్వర్, శ్రీకాంత్, శ్రీనాథ్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. కష్టకాలంలో తమ సహోద్యోగి కుటుంబానికి అండగా నిలవడంలో యూనియన్ సభ్యులు తమ ఐకమత్యాన్ని చాటుకున్నారు.