ఘనంగా జి.మాడుగులలో ఏఐటియుసి 106వ ఆవిర్భావ దినోత్సవం

జి.మాడుగులలో జిసిసి ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తున్న ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పండు బాబు

సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 31 జి.మాడుగుల: జిసిసి ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం జిసిసి హమాలీ కార్మికులు, ఏఐటియుసి నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక జిసిసి పాయింట్ ఆవరణలో హమాలీ కార్మికులు ఏర్పాటుచేసిన ఏఐటీయూసీ జెండాను ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వంతాల పండుబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐటియుసి 1920లో ఏర్పడి పోరాటాలు,ఉద్యమాల చరిత్రలో 106వ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కార్మిక వర్గానికి ఆవిర్భావ శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు, 4 లేబర్ కోడ్ లను రద్దుచేసి, 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, కనీస వేతనం రూ 26,000 నిర్ణయించి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అసంఘటితరంగ కార్మికులకు సమగ్ర సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడదామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మిక సంఘ నాయకులు సత్తిబాబు, శ్రీనుబాబు బాబురావు, శ్రీను, సురేష్ హమాలీలు పాల్గొన్నారు