సాక్షి డిజిటల్ న్యూస్ 31 సెప్టెంబర్, నారాయణపేట నియోజకవర్గం రిపోర్టర్ క్రిష్ణ, మరికల్: మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 38 వ వర్ధంతి వేడుకలను మరికల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా నాయకులు సూర్యమోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ విగ్రహానికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సూర్యమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ హయాంలో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ భూమిలేని, ఇల్లు లేని నిరుపేదలైన వారందరికీ పట్టాలు అందించి ఇందిరమ్మ పక్కా ఇల్లు నిర్మించిన ఘనత ఇందిరాగాంధీకి చెందిందన్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇందిరమ్మ ఆశయాలను కొనసాగిస్తున్నారు అన్నారు. కార్యక్రమంలో గొల్ల కృష్ణయ్య, హరీష్ ,రామకృష్ణారెడ్డి, రామకృష్ణ, గొల్ల రాజు, జంగిడి రవి ,జంగిడి శ్రీనివాస్, ట్రైసన్ రఘు , రఘు తదితరులు పాల్గొన్నారు.