గాంధారిలో 2కే రన్ ఫర్ యూనిట్ కార్యక్రమం*దేశ సమగ్రత కోసం ప్రతి ఒక్కరుకలిసికట్టుగా కృషి చేయాలని

*ఎస్ఐ ఆంజనేయులు

సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31, కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర ఏకతా దివస్ నీ పురస్కరించుకొని స్థానిక ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో 2కే రన్ ఫర్ యూనిట్ కార్యక్రమం నెహ్రూ చౌరస్తా నుండి మీదుగా శివాజీ చౌరస్తా వరకు ఈ 2కే రన్ నిర్వహించినట్లు తెలిపారు. ఎస్ఐ ఆంజనేయులు మాట్లాడుతూ..భారతదేశ ఐక్యత, సమగ్రత, భద్రతను పెంపొందించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జాతీయ ఐక్యత దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర అనంతరం బ్రిటీషు రాజ్యంలో స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న వివిధ ప్రాంతాలను సమైక్యతా స్ఫూర్తితో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏకం చేశారని గుర్తు చేసుకున్నారు. ‘ఉక్కు మనిషి’గా పేరొందిన ఆయన స్ఫూర్తిని ప్రతిఒక్క పౌరుడు కొనసాగించాలని ఆకాంక్షించారు. దేశ భద్రత కోసం ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడాటానికి తమను తాము అంకితం చేసుకుంటామని, తోటి వారితో సమైకత్య స్ఫూర్తి సందేశాన్ని పంచుకుంటామని 2కే రన్ లో పాల్గొన్న యువత, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, బీసీ నాయకులు, వైద్యులు, మండల గ్రామ ప్రజలు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *