సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31 తంబల్లపల్లి మండల రిపోర్టర్ ఇ. రమేష్ బాబు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యతో ఉత్తమ ఫలితాలు సాధనకు కష్టపడి చదవాలని తంబళ్లపల్లె కోర్టు న్యాయమూర్తి ఉమర్ ఫరూక్ సూచించారు. శుక్రవారం ఆయన తంబళ్లపల్లె గిరిజన గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన వసతి, బోధన సామర్థ్యం పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించి సత్ఫలితాలు సాధనకు కృషి చేయాలని అధ్యాపకులకు అదే విధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట గురుకుల అధ్యాపక బృందం, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.