కోతుల నియంత్రణ కు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి

సాక్షి డిజిటల్ న్యూస్ తేదీ 31 అక్టోబర్ 2025 యాదాద్రి జిల్లా గుండాల మండలం రిపోర్టర్ ఎండి ఉస్మాన్
గుండాల మండలంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, గుంపులు గుంపులుగా బయలుదేరి ఇళ్లలోకి చొరబడి దాడులకు పాల్పడుతున్నాయి,ఇల్లు దుకాణాలలో వస్తువులు తినుబండారాలు కూరగాయలను ఎత్తుకుపోయి అడ్డుకుంటే దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి ఇళ్ల తలుపులు తెరిచి ఉంటే వారి ఇల్లు అయినట్టే కోతల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారనీ కోతుల నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలని అడవి ప్రాంతాలు రోజురోజుకు తగ్గిపోవడం వాటికి అడవిలో ఆహారం లభించకపోవడంతో గ్రామాలకు వస్తున్నాయని గుంపులు గుంపులుగా కాలనీలలో సంచరిస్తూ వీరంగం సృష్టిస్తున్నాయని,కోతుల నియంత్రణకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు