కోతుల గుంపులతో భయపడుతున్న జనం

★కోతుల గుంపులతో భయపడుతున్న జనం ★తిరుమలగిరి మండల మున్సిపాలిటీ మాల మహానాడు అధ్యక్షుడు గంట లక్ష్మణ్

సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31 తిరుమలగిరి మండల రిపోర్టర్ బాకీ శ్రీనివాస్, తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీలో కోతుల గుంపులు ఒక్కసారిగా వచ్చి ఇండ్లలో జోరపడుతున్నాయని తిరుమలగిరి మండలం మున్సిపాలిటీ మాల మహానాడు అధ్యక్షుడు గంట లక్ష్మణ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అన్నాడు కోతులు ఇండ్లకు వచ్చి ఎవరు డోర్ తెరిసి ఉంచిన ఇంట్లో జొరబడి బియ్యమును అన్నమును కూరగాయలను పండ్లను ఎత్తుకెళుతు మనం వెళ్ళగొట్టబోయిన మన మీద పడి కరుస్తు బజారుకు వెళ్లి కూరగాయలు పండ్లు కవర్లో తీసుకవచ్చే పరిస్థితి లేదని చిన్నపిల్లలు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొచ్చిన మీద పడి కవర్లు ఎత్తుకుపోతు తిరగబడి కరుస్తు రోడ్డుమీద కిరాణం షాపులు పండ్ల బండ్లు పెట్టుకున్న వాళ్ల మీద ఎగబడుతు రైతులు వేరుశనగ మొక్కజొన్న పెసర కందులు లాంటి పంటలేస్తే వాటిని ఖరాబు చేస్తు కూరగాయలు పండిద్దామని కూరగాయలు వేస్తే వాటిని ఉంచడం లేవు ఏ మారుమూల చిన్న గ్రామంలో చూసిన కోతులు ఉన్నాయీ ఏ తండలో చూసిన ఇదేవిధంగా కోతులు ఉంటే జనం బ్రతకడం చాలా కష్టమని జనం వాపోతున్నారు ఇట్టి కోతుల విషయంలో ప్రభుత్వ అధికారులు గానీ ప్రభుత్వం కానీ వెంటనే చర్య తీసుకోవాలని తిరుమలగిరి మండల మున్సిపాలిటీ మాల మహానాడు అధ్యక్షుడు గంట లక్ష్మణ్ డిమాండ్ చేశారు