సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31 పెనగలూరు రిపోర్టర్ మధు, కార్మిక హక్కుల కోసం నిరంతర పోరు కొనసాగిస్తాం మాదరాజు గంగాధర్ ఏఐటియూసి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం అక్టోబర్ 31 కార్మికుల హక్కుల కోసం ఏ.ఐ.టి.యూ.సి నిరంతరం పోరు సాగిస్తోందని ఏఐటియూసి జిల్లా అధ్యక్షులు మాధరాజు గంగాధర్ పేర్కొన్నారు పెనగలూరు లో శుక్రవారం ఏఐటియూసి 106 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయిఏఐటియూసి పతాకాన్ని సిపిఐమండల కార్యదర్శి ఆదినారాయణ ఆవిష్కరించారు . అనంతరం జిల్లా అధ్యక్షులు గంగాధర్
మాట్లాడుతూ కేంద్రం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా మార్చి కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు . ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసిందని అన్నారు. . దేశం లోని అనేక పరిశ్రమలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిందని అన్నారు . ఎల్.ఐ.సి లోని డబ్బు ను సైతం అదానీ సంస్థ లోకి మళ్లించడం దుర్మార్గ మన్నారు . నేడు దేశవ్యాప్తంగా ఏ.ఐ.టి.యూ.సి 106వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నధని అన్నారు. కార్మికుల హక్కుల సాధనకు శ్రామిక వర్గం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమం లో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మండల సహాయ కార్యదర్శి లక్ష్మీనారాయణ శంకరయ్య ఆటో యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు మాధరాజు గంగాధర్ ఏఐటియుసి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు.