ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం…

*కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి సభ్యులు పి రఘునాథ్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 31, రామకృష్ణాపూర్: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భారత దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి సభ్యులు పి రఘునాథ్ రెడ్డి లు స్పష్టం చేశారు. శుక్రవారం ఆర్కేపి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు ఇందిరమ్మ వర్ధంతి సంద‌ర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు.సామాజిక, రాజకీయ,సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో రాణించిన ఇందిరా గాంధీ భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు. ఆమె స్ఫూర్తి తో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, గోపు రాజం, బత్తుల వేణు, భీమ మల్లేశ్, బొద్దుల ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *