ఇందిరమ్మ ప్రాణ త్యాగాలు వృథా పోలేదు

*షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ *షాద్ నగర్ లో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి *సూర్యుడిలా వెలుగు పంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ *సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

సాక్షి డిజిటల్ న్యూస్ oct31/ఫరూక్ నగర్ రిపోర్టర్ కృష్ణ, గరిబీ హఠావో నినాదంతో దేశంలోని పేదల ఆకలి తీర్చిన ఘనత స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీకే దక్కుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1966లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన నాటికి దేశంలో ఆర్థిక మాంద్యం, పారిశ్రామిక ఉత్పత్తుల పతనం, ఎగుమతులు తగ్గడం, ఆహారధాన్యాల సంక్షోభం ఏర్పడ్డాయనీ, వీటితో పాటు బడ్జెట్ డెఫిసిట్ పెరగడం, విదేశీ ఆర్థిక సాయంపై ఎక్కువగా ఆధారపడటం వంటివే గాక 1962, 1965నాటి యుద్ధాలు, పాకిస్థాన్– చైనా కూటమి ఏర్పాటులో సైన్యంపై ఖర్చు పెంచడం వంటివీ జరిగాయన్నారు. వర్షాలు లేక కరువు ఏర్పడిందనీ ధరలు పెరిగాయనీ పాలనా ఖర్చులు తగ్గించుకోవడం వీలుపడలేదనీ అయినా, యుద్ధ ప్రాతిపదికన ఆహార ధాన్యాలు సేకరించి, ప్రజలకు పంచి, వారి ప్రాణాలు కాపాడగలిగారనీ ఇందిరాగాంధీ ధైర్య సాహసాలు మరే నాయకురాలు కనిపించవని అన్నారు. ‘నా దేశం గొప్పది’ అనే గర్వం ఆమెలో ప్రస్ఫుటంగా అగుపడేదనీ భారత్‌ ఎదగబోయే స్థాయిని అంచనా వేసుకుని ప్పొంగిపోయేవారన్నారు. అందుకే, దేశ ప్రాధాన్యాలు, దేశ గౌరవం కాపాడ్డంలో ఇందిర రాజీపడేవారు కాదనీ కొనియాడారు. బాడీగార్డ్స్‌ చేతుల్లో 1984 అక్టోబర్ 31న ఇందిర అస్తమించారనీ దేశం గొప్ప నాయకురాలిని కోల్పోయిందనీ బడుగు, మైనార్టీ ప్రజలంతా తమ ‘అమ్మ’ను కోల్పోయినట్లుగా బాధపడ్డారనీ దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన ఇందిర చిరస్మరణీయురాలనీ శంకర్ నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *