సాక్షిడిజిటల్ న్యూస్, నవంబర్ 01,రాయికల్, వై. కిరణ్ బాబు:- జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ధర్మాజీ పేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మొట్టమొదటిగా ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం,గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులైనా మ్యాకల సరస్వతి -రాజిరెడ్డి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపి,ఇంటి ఆడబిడ్డ కి చీర కట్నంగా అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.ఈ కార్యక్రమంలో రవీంధర్ రావు,కోలశ్రీనివాస్,సురేందర్ నాయక్,అనుపురం శ్రీనివాస్,పాదం రాజు,రవి,శ్రీనివాస్ మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్, గంగరాజు, ఉమా, మహేష్, రాజీ రెడ్డి, మల్లేష్, ప్రకాష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.