ఆర్గానిక్ ఫుడ్ తోనే -ఆరోగ్యం

*కాంగ్రెస్ జిల్లా నాయకుడు సూర్యమోహన్ రెడ్డి


సాక్షి డిజిటల్ న్యూస్ 31 సెప్టెంబర్, నారాయణపేట నియోజకవర్గం రిపోర్టర్ క్రిష్ణ, మరికల్:ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుందని కాంగ్రెస్ జిల్లా నాయకులు సూర్యమోహన్ రెడ్డి అన్నారు. మరికల్ మండలకేంద్రంలో మయూరి ఆర్గానిక్ టిఫిన్ సెంటర్ ను శుక్రవారం సూర్యమోహన్ రెడ్డి ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా తరువాత ప్రజలు ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడానికి అలవాటు పడుతున్నారని, దానికి అనుగుణంగా ఆర్గానిక్ టిఫిన్స్ పెట్టడం అభినందనీయమని, నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి, భారత్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో గొల్ల కృష్ణయ్య, హరీష్,దామోదర్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, రామకృష్ణ, గొల్ల రాజు, రవి జంగిడి శ్రీనివాసులు ట్రైసన్ రఘు, రఘు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *