సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31 రామకుప్పం రిపోర్టర్ జయరామిరెడ్డి చిత్తూరు జిల్లా పక్కా అంగన్వాడి భవనం నిర్మించేందుకు చేపట్టిన పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి దీంతో స్పందించాల్సిన పాలకవర్గం పట్టించుకోకపోవడంతో అసంపూర్తిగా కనిపిస్తున్న అంగన్వాడి భవన దుస్థితి మండలంలోని సింగసముద్రం పంచాయతీ కుప్పిగాని పల్లి గ్రామంలో చోటుచేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయి కుప్పిగానిపల్లి గ్రామంలో అంగన్వాడీ భవనం నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది దీంతో గ్రామంలోని ఓ వ్యక్తి స్థలాన్ని విరాళంగా ప్రకటించాడు పనులు చేపట్టిన అనంతరం పూర్తి చేయకపోవడంతో అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం పాలనలో పనులు చేపట్టారు సకాలంలో పూర్తి కాకపోవడంతో ప్రభుత్వాలు మారి పనులు నిలిచిపోయాయి దీంతో అంగన్వాడి భవనం చుట్టూ ముళ్ళపాలు దర్శనమిస్తున్నాయి గ్రామంలోనున్న సుమారు 30 మంది చిన్నారులు మరో భవనంలో తలదాచుకుంటున్నారు సంబంధిత అధికారులు స్పందించి అసంపూర్తిగా నిలిచిపోయిన అంగన్వాడీ భవన దుస్థితిపై స్పందించాల్సిందని గ్రామస్తుల కోరుతున్నారు